దేశంలో మరో సిలికాన్ వ్యాలీ క్రియేట్ చేయాలి

 దేశంలో మరో సిలికాన్ వ్యాలీ క్రియేట్ చేయాలి
  • వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే కంపెనీలను కార్పొరేట్ స్టైల్‌‌‌‌‌‌‌‌లో నడపాలని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి సలహాయిచ్చారు. పదేళ్ల కిందట సివిల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రభుత్వ కంపెనీలను కార్పొరేటేజేషన్ చేసినట్టే  డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా చేయాలని అన్నారు. లోకల్‌‌‌‌‌‌‌‌గా సెమికండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌ తయారీకి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే దేశంలో కూడా ఓ సిలికాన్ వ్యాలీ క్రియేట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ పరికరాలను తయారు చేసే ఫ్యాక్టరీలను కార్పొరేటైజేషన్ చేయడంపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు.  ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలు కేవలం 10 శాతం కెపాసిటీతోనే పనిచేస్తున్నాయని, అదే వీటిని కార్పొరేట్ స్టైల్‌‌‌‌‌‌‌‌లోకి మారిస్తే  వీటి పూర్తి కెపాసిటీ బయటకొస్తుందని వివరించారు. బెంగళూరు ఐఐఎంలో మాట్లాడిన  అనిల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌, పై వ్యాఖ్యలు చేశారు.   కార్పొరేటైజేషన్ వలన వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్పారు. ఇండియాలో ప్రొడక్షన్ జరగకూడదనే గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లు భావిస్తున్నాయని, ఇండియాను కేవలం మార్కెట్‌‌‌‌‌‌‌‌గానే ఇవి చూస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ స్టైల్ వర్క్ విధానంలోకి మార్చడమే కార్పొరేటైజేషన్. 
కంపెనీల్లో మెజార్టీ వాటా ప్రభుత్వం దగ్గరే ఉండి ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేలా పనిచేయడమే  కార్పొరేటైజేషన్  ముఖ్య ఉద్దేశం. డిఫెన్స్ సెక్టార్ కోసం ట్యాంకుల నుంచి క్లాత్‌‌‌‌‌‌‌‌ల వరకు తయారు చేసే ఆర్డనన్స్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌బీ) ని  ప్రభుత్వం కిందటేడాది రీస్ట్రక్చర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీని మొత్తం ఏడు కంపెనీలుగా మార్చింది. ‘మనం పెద్ద మొత్తంలో సెమికండక్టర్లను, సెమికండక్టర్ల కాంపోనెంట్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో డిస్‌‌‌‌‌‌‌‌ప్లే గ్లాస్‌‌‌‌‌‌‌‌లు కూడా ఉన్నాయి.

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే డిస్‌‌‌‌‌‌‌‌ప్లే గ్లాస్‌‌‌‌‌‌‌‌లను తయారు చేస్తున్నాయి’ అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇండియాలో చాలా అవకాశాలు ఉన్నాయని, కేవలం రెండేళ్లలోనే దేశంలో ఓ సిలికాన్ వ్యాలీ క్రియేట్ అవుతుందని చెప్పారు. ప్రభుత్వం సపోర్ట్ చేస్తోందని, త్వరలోనే తక్కువ రేటుకే సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, టీవీలును తయారు చేసుకోగలుగుతామని అన్నారు. ఇంకో 2–3 ఏళ్లలో సెమికండక్టర్లను తయారు చేస్తామని వేదాంత ప్రకటించింది.