Vinesh Phogat: ఇదెక్కడి న్యాయం.. వినేశ్‌ ఫోగాట్‌ పతకానికి అర్హురాలన్న సచిన్

పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా బరువు అనర్హత వేటు ఎదుర్కొన్న భారత రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ మద్దతు తెలిపారు. ఒలింపిక్స్ నియమనిబంధనల్లోని లొసుగులను ప్రశ్నిస్తూ మాజీ దిగ్గజం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

తనపై పడిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్‌ ఫోగాట్.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (Court of Arbitration for Sports‌) ఆశ్రయించింది. ఉమ్మడి రజత పతక విజేతగా ప్రకటించాలని కోరింది. శుక్రవారం(ఆగస్టు 9) ఈ అప్పీల్‌ను విచారించిన కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS).. పారిస్ ఒలింపిక్స్ ముగిసేలోపు నిర్ణయం వెలువడుతుందని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనని సచిన్ ట్వీట్ చేశారు. అంపైర్‌ తీర్పుకు సమయం ఆసన్నమైందన్న సచిన్.. భారత రెజ్లర్‌కు రజత పతకం వస్తుందని ఆశిద్దామంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

"ప్రతి క్రీడకు నియమాలు ఉంటాయి. కాకపోతే, ఆ నియమాలను సందర్భానుసారంగా చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మళ్లీ పరిశీలించాల్సిన అవసరమూ ఉంటుంది. అంతకుముందు వినేశ్‌ ఫోగాట్ అందరినీ ఓడిస్తూ ఫైనల్ చేరుకుంది. అధిక బరువుతో ఆమె డిస్‌క్వాలిఫై అయింది ఫైనల్స్‌కి ముందు మాత్రమే. కానీ ఆమెకు సిల్వర్‌ మెడల్‌ అందకుండా చేయడంలో లాజిక్‌, స్పోర్టింగ్‌ సెన్స్‌ రెండూ లేవు' అని సచిన్ ట్వీట్​లో పేర్కొన్నారు"

ఒకవేళ అంతకుకాదంటే, ఒక క్రీడాకారుడు తన పెర్ఫార్మెన్స్​ మెరుగు పర్చుకునేందుకు డ్రగ్స్‌ ఉపయోగిస్తే అనర్హత వేటు వేయడంలో అర్థం ఉందని సచిన్ అన్నారు.

మనసు మార్చుకుంటారా..!

అంతర్జాతీయ స్థాయిలో సచిన్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నేపథ్యంలో అతని ట్వీట్ చూసైన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW ) సభ్యులు, ఒలింపిక్స్ నిర్వాహకులు మార్చుకుంటారేమో అన్న మాటలు వినపడుతున్నాయి. సచిన్‌ వాదనను నెటిజన్లు సమర్థిస్తున్నారు.