
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 2023-–24 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సు–సీట్లు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు): 720, బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (నాలుగేళ్లు): 43, బీవీఎస్సీ అండ్ ఏహెచ్(ఐదున్నరేళ్లు): 174, బీఎఫ్‌ఎస్సీ(నాలుగేళ్లు): 39, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు): 204 సీట్లు కేటాయించారు.
అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్)తో పాటు టీఎస్ ఎంసెట్-2023 ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్: టీఎస్ ఎంసెట్-2023లో అభ్యర్థులు పొందిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.pjtsau.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.