డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

 డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌  విడుదలైంది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి‌లో డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.

దోస్త్ నోటిఫికేషన్ లో భాగంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.. మూడు  విడతల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయనున్నారు.  దోస్త్ వెబ్ సైట్,  ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

అర్హత క‌లిగిన విద్యార్థులు ఫేజ్ 1లో  మే 16 నుంచి జూన్ 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 20  నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవ‌చ్చు. జూన్ 16న ఫేజ్ -1  సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఫేజ్ 2కి సంబంధించి జూన్ 16 నుంచి జూన్ 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఫేజ్ 2 విద్యార్థులకు  జూన్  27 వరకు వెబ్ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకొనే అవకాశం ఉంది.  జూన్ 30 న ఫేజ్-2 సీట్లను కేటాయిస్తారు.

ఫేజ్ 3లో జూలై 1 నుంచి జూలై 5 వరకు  రిజస్ట్రేషన్,,జులై 6న వెబ్ ఆప్షన్.. జులై 10న సీట్లను కేటాయిస్తారు.  జూలై 17 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.