భువనగిరిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్​కు కోమటి రెడ్డి వెంకటరెడ్డి లేఖ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్​కు ఆయన బహిరంగ లేఖ రాశారు. 

అందులోని వివరాల ప్రకారం.. గతంలో సీఎం కేసీఆర్​ ఎన్నికల హామీ ఇచ్చారని.. ఇప్పటికైనా కాలేజీ మంజూరు చేయాలని కోరారు. కళాశాల లేక విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిరుపయోగంగా ఉన్న భవనాల్లో తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మూడు దశలు కంప్లీట్​ అయిన దోస్త్​ అడ్మిషన్ల ప్రక్రియ భవనం కేటాయిస్తే నాలుగో దశ విద్యార్థులైన ఇక్కడే వెబ్​ఆప్షన్స్​ఉపయోగించుకోగలరని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు.