కొత్తగూడకు డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలి: సీతక్క

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తగూడకు డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ లింబాద్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో డిగ్రీ కాలేజ్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్ల స్టూడెంట్లు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు.

 స్పందించి కొత్తగూడలో డిగ్రీ మంజూరు ఏర్పాటు చేయాలని కోరారు.