గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

కోర్సు‑సీట్లు:  మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉండగా బీఎస్సీ(ఎంపీసీ): 40 సీట్లు, బీఏ(హెచ్‌‌ఈపీ): 40 సీట్లు ఉన్నాయి. కోర్సు డ్యూరేషన్  మూడేళ్లు ఉంటుంది.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60శాతం  మార్కులతో 2023, 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌‌ ఉత్తీర్ణులైన పురుష విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. అభ్యర్థులు కనీస ఎత్తు 152 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి. ఎంట్రెన్స్​ టెస్ట్​, ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్‌‌, మెడికల్ టెస్ట్‌‌, లెక్చరట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా మే 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ttwrdcs.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.