డిగ్రీ ఫైనల్​ కౌన్సెలింగ్ నవంబర్ మూడో వారంలో

డిగ్రీ ఫైనల్​ కౌన్సెలింగ్ నవంబర్ మూడో వారంలో

డిగ్రీ మరో విడత కౌన్సెలింగ్​

పరీక్షలు రాయని వారినీ ఇంటర్​ బోర్డు పాస్​ చేయడంతో నిర్ణయం

దోస్త్​ చివరి దశ కౌన్సెలింగ్​కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఇప్పటికే పూర్తయిన సెకండ్​ఫేజ్​, స్పెషల్​ ఫేజ్​ కౌన్సెలింగ్​

హైదరాబాద్​, వెలుగు: డిగ్రీ అడ్మిషన్ల కోసం మరో విడత కౌన్సెలింగ్​ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నెల మూడో వారంలో దోస్త్​ ఫైనల్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్​ పరీక్షలు రాయని వారినీ బోర్డు పాస్​ చేయడం, ఎంసెట్​ కౌన్సెలింగ్​ ఇంకా కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే రెండు విడతల్లో దోస్త్​ కౌన్సెలింగ్​తో పాటు స్పెషల్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ను నిర్వహించారు. అయితే, చాలామంది స్టూడెంట్లకు సీట్లు రాలేదు. సీట్లు దక్కించుకున్న వాళ్లంతా ఈ నెల 5 వరకు ఆన్​లైన్​లో రిపోర్ట్​ చేయాల్సి ఉంది. సీట్లు రాని వాళ్లు రోజూ ఉన్నత విద్యామండలి, దోస్త్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజు కట్టి పరీక్ష రాయని 27,589 మంది ఇంటర్​ స్టూడెంట్లు, మాల్​ ప్రాక్టీస్​ కేసుల్లో బుక్కయిన వారిని గ్రేస్​ మార్కులతో పాస్​ చేస్తున్నట్లు బోర్డు రెండు రోజుల క్రితం వెల్లడించింది. మరోవైపు ఎంసెట్​ స్పెషల్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ ఇంకా కొనసాగుతోంది. ఈ నెల12న సీట్ల కేటాయింపు ఉండగా, 17 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్​ చేసేందుకు చాన్స్​ ఇచ్చారు. దీంతో ఎంసెట్​లో సీట్లు రాని స్టూడెంట్లు డిగ్రీ వైపు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకున్న ఉన్నత విద్యా మండలి.. అలాంటి వాళ్ల కోసం మరో ఫేజ్​ కౌన్సెలింగ్​ నిర్వహించాలని నిర్ణయించింది. చివరి దశగా నిర్వహించే ఈ కౌన్సెలింగ్​లో 20 వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యే చాన్స్​ ఉందని అధికారులు భావిస్తున్నారు. “మరో విడత దోస్త్​ కౌన్సెలింగ్​ నిర్వహించాలనుకుంటున్నాం. కౌన్సెలింగ్​ ఎప్పుడు పెట్టాలన్న దానిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తాం. తర్వాత షెడ్యూల్​ రిలీజ్​ చేస్తాం’’ అని దోస్త్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ లింబాద్రి చెప్పారు.

For More News..

డాక్టర్లకు పీజీ రిజిస్ట్రేషన్ తిప్పలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఫామ్ ధర రూ. 10 వేలు

ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ ఇంటి దగ్గరి కాలేజీల్లోనే