మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలో బాలిక కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..యువకుడిపై కేసు నమోదు

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలో బాలిక కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..యువకుడిపై కేసు నమోదు

మెట్ పల్లి, వెలుగు : డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ఆమెతో చదువుకునే యువకుడు ప్రేమ పేరుతో కిడ్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం విట్టంపేట గ్రామానికి చెందిన ఓ యువతి పట్టణంలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 15న బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. 

సాయంత్రం ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించలేదు. బాలిక ఆచూకీ కోసం ఆరా తీయగా బాలిక చదివే కాలేజీలోనే చదువుకుంటున్న ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన ఆర్.రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొంత కాలంగా  ప్రేమపేరుతో బాలిక వెంటపడేవాడని, అతడు తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.