
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 290 డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత : సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.57,700 - నుంచి రూ.1,82,400 ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు), సంబంధిత సబ్జెక్టు(పీజీ స్టాండర్డ్) నుంచి 150 ప్రశ్నలు (300 మార్కులు) అడుగుతారు. ప్రతి పేపర్‌కు 150 నిమిషాల సమయం ఉంటుంది.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఏప్రిల్ లేదా మే నెలలో ఉంటుంది. వివరాలకు www.psc.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.