డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలు: ఒకే రోజు రెండు చోట్ల డ్యూటీలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి డ్యూటీలు వేయడంలో నిర్లక్ష్యం లెక్చరర్లకు తలనొప్పిగా మారింది. కేయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బుధవారం నాడు కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ ప్రాక్టికల్స్‌ మొదలయ్యాయి. ఒక్కో లెక్చరర్ కు ఒకేరోజు రెండు, మూడు చోట్ల డ్యూటీలు వేశారు. ఒకసెంటర్ కు, మరో సెంటర్ కు మధ్య  180 కి లోమీటర్లదూరం ఉండడంతో ఎక్కడికెళ్లాలో తెలియక వారు ఆయోమయానికి గురయ్యారు. ఒక లెక్చరర్ కు నిర్మల్, తాండూర్ సెంటర్లలో డ్యూటీ వేశారు. దాంతో ఆయన ఏ సెంటర్ లో డ్యూటీ చేయలేకపోయాడు.

యూనివర్సిటీ ఉన్నతాధికారులు ప్రాక్టికల్ పరీక్ష డ్యూటీలు వేసిన లెక్చరర్ల వివరాలు కాలేజీలకు కూడాఅందించలేదు. ఎవరికెక్కడ డ్యూటీ వేశారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా కాలేజీల మేనేజిమెంట్లే సొంతంగా ప్రాక్టికల్స్ పరీక్షలు కండక్ఠ్‌ చేశాయని తెలిసింది. భైంసాలోని గోపాల్ రావు పటేల్ డిగ్రీ కాలేజీలో బోటనీ లెక్చరర్‌ డాక్టర్‌  మధుకు ఈ నెల 26వ తేదిన నిర్మల్ లోని ప్రభుత్వ డిగ్రీకాలేజీ, తాండూర్ లోని భారతీ డిగ్రీ కాలేజీల్లో ఉదయం 11.30 గంటలకు డ్యూటీ వేశారు. ఈ రెండుసెంటర్ల మధ్య దూరం 180 కి లోమీటర్లు ఉంటుంది. ఒకే రోజు ఒకే టైమ్ లో రెండు డ్యూటీలుఎలాచేయాలో అని తలపట్టుకుంటున్నారు.