న్యూస్ పేపర్లతో అయోధ్య రామమందిరం.. భక్తిని చాటుకున్న డిగ్రీ విద్యార్థిని

అయోధ్య లో జనవరి 22న జరగబోయే శ్రీరాముడి మందిరం పున:ప్రారంభం సందర్భంగా తన భక్తిని చాటుకుంది ఓ యువతి. కేవలం న్యూస్ పేపర్లు, ఫెవికల్ ఉపయోగించి అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసి బీఈడీ విద్యార్థి విజయలక్ష్మి తన భక్తిని చాటుకుంది.

నల్గొండ జిలా చండూర్ మున్సిపాలిటీకి  చెందిన చేనేత కార్మికుడు చెరుపల్లి శ్రీనివాస్ కూతురు విజయలక్ష్మి తన సొంత ఆలోచనలతో న్యూస్ పేపర్లతో అయోధ్య రామమందిరం తయారు చేసింది. ప్రతి ఇంటికీ శ్రీరాముని అక్షింతలు అందిన రోజున  ఆలయ నమూనా చేయాలన్న ఆలోచన వచ్చిందని..  కేవలం న్యూస్ పేపర్, ఫెవికల్ ఉపయోగించి రామమందిరం నమూనా మొదలు పెట్టి, రాముడి ప్రాణప్రతిష్ట రోజు వరకు సిద్ధం చేయాలన్న సంకల్పంతో.. వారం రోజులు కష్టపడి  సిద్ధం చేశానని తెలిపింది. ఫోటో ఆధారంగా తాను ఈ ఆలయ నమూనా తయారు చేసినట్లు విద్యార్థిని చెప్పింది. తన అద్భుతమైన ప్రతిభతో  అందరినీ ఆకట్టుకుంటున్న విజయలక్ష్మీని అందరూ మెచ్చుకుంటున్నారు.