టెరిఫిక్ యాక్సిడెంట్.. స్పాట్ లోనే ఆరుగురు స్టూడెంట్స్ మృతి.. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. స్టూడెంట్స్ తలలు తెగిపడ్డాయి. చనిపోయిన మృతుల్లో ముగ్గురు అమ్మాయి..మద్యం మత్తే ఈ ఘోరానికి కారణమా.. అతివేగమే వారి ప్రాణాలు గాల్లో కలిపిందా?.. యాక్సిడెంట్ కు ముందు కారులో ఏం జరిగింది..? ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది.. జార్ఖండ్ లోని డెహ్రడూన్ లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియో ఏం చెబుతోంది..
Dehradun Accident
— sumit 🇮🇳 (@sumit45678901) November 14, 2024
6 De@d including 3 Girls.
This is their last video before the tragedy
As evident from this video they indeed were drunk. pic.twitter.com/co0X7x1yvN
సరిడెహ్రడూన్లో ఆరుగురు స్టూడెంట్స్ చనిపోయిన ఘోరకారు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్ కు ముందు కాలేజీ స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటూ మద్యం మత్తులో ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మితి మీరిన వేగం లో కారు నడిపినట్లు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిందని పోలీసులు చెబుతున్నారు.
మంగళవారం ( నవంబర్ 12) తెల్లవారు జామున 1.30 గంటలకు డెహ్రడూన్ లోని ఓఎన్ జీసీ చౌక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో స్టూడెంట్స్ డ్రైవ్ చేస్తూ.. బీఎండబ్ల్యూ కారును ఓవర్ ఛేజ్ చేసే క్రమంలో ట్రక్కును కారు వెనకనుంచి హైస్పీడ్ లో బలంగా ఢీకొట్టింది. కారు తుక్కుతుక్కయింది. ఆరుగురు విద్యార్థులు స్పాట్ లోని చనిపోయారు.మరో విద్యార్థి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
అయితే ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదని సీసీఫుటేజ్ లో సంచలన విషయాలు రికార్డయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న స్టూడెంట్ పార్టీ చేసుకుంటున్నారని.మద్యం, మ్యూజిక్ కిక్కుతో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయింది. అయితే విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు స్పాట్ లో ప్రాణాలు వదలగా.. కారు డ్రైవింగ్ చేస్తున్న మరో విద్యార్థి ఆస్పత్రిలో ఐసీయూ చికిత్స పొందుతున్నాడు. మృతులు కునాల్ కుక్రేజా(23), అతుల్ అగర్వాల్(24), రిషల్ జైన్(24), నవ్యవ గోయెల్(23), కామాక్షి(20), గునీత్(19). చికిత్స పొందుతున్న విద్యార్థి సిద్దేష్ (26) గా గుర్తించారు. కుక్రేజా హిమాచల్ ప్రదేశ్ కు చెందగా.. మిగతావారంతా డెహ్రాడూన్ కు చెందినవారు. కారు యాక్సిడెంట్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.