అది ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ ప్రాంతం.. గురువారం ( నవంబర్ 9) ఉదయం 10.30 గంటల సమయం..దుండగులు వారి వ్యూహానికి పదును పెట్టారు..డెహ్రడూన్ రాజాపూర్ రోడ్డులోని రిలయన్స్ జ్యువెల్లరీ షాపులో చోరీకి భారీ స్కెచ్ వేశారు. షాపు కీపర్ల తలకు గన్ గురిపెట్టి కోట్ల విలువైన నగలును క్షణాల్లో దోచుకెళ్లారు.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో గురువారం ఉదయం రిలయన్స్ జ్వువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. ఆయుధాలతో షాపులోకి ప్రవేశించిన ఐదుగురు గుర్తుతెలియని దుండగులు దర్జాగా నగలు దోచుకెళ్లారు.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమైన ఉండగా.. పక్కా స్కెచ్ తో కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. దుండగుల్లో ఒకరు ప్రశాంతంగా నగలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో కనిపిస్తున్నాయి. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ప్యాకింగ్ చేయడంలో మిగతా వారు సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
देहरादून में रिलायंस ज्वेलरी शोरूम में करोड़ों की लूट का CCTV –
बदमाश कस्टमर बनाकर घुसे। सबको गन पॉइंट पर लिया। सोने और हीरे के जेवरात लूटकर भाग गए।
आज शहर में राष्ट्रपति थीं। सारा पुलिस फोर्स उनकी सुरक्षा में लगा था। बाकी फोर्स कल अमित शाह के आगमन की तैयारियों में बिजी था। https://t.co/dH0lMHJ9UR pic.twitter.com/ZTad7LC9Vx
— Sachin Gupta (@SachinGuptaUP) November 9, 2023