కామారెడ్డిలో డయాగ్నోస్టిక్ ​హబ్ ఏర్పాటులో డిలే

కామారెడ్డిలో డయాగ్నోస్టిక్ ​హబ్ ఏర్పాటులో డిలే
  • డయాగ్నోస్టిక్​హబ్ ఏర్పాటులో డిలే
  • టెస్టులకు ప్రైవేట్‌‌‌‌కు వెళ్లక తప్పట్లేదు

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హాబ్ ఏర్పాటులో డిలే జరుగుతోంది. పక్క జిల్లాల్లో డయాగ్నోస్టిక్ హబ్​ఏర్పాటు చేసి నెలలు గడుస్తుంటే ఇక్కడ మాత్రం ఇంకా ఏర్పాటు పక్రియ షూరు కాలేదు. జిల్లా హాస్పిటల్‌‌‌‌లో డయాగ్నోస్టిక్​హబ్ ఏర్పాటుకు స్థలం లేకపోవడం ప్రధాన సమస్య కాగా.. మరో చోట బిల్డింగ్​నిర్మించి ఏర్పాటు చేయాలని భావించినా ముందుకు సాగడం లేదు. 

అసలు సమస్య ఇదీ..
జిల్లా హాస్పిటల్‌‌‌‌లో డయాగ్నోస్టిక్​హబ్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఇక్కడ స్థలం సమస్య ఏర్పడింది. 100 బెడ్స్​ఏరియా హాస్పిటల్‌‌‌‌గా ఉన్న దీనిని జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత జిల్లా హాస్పిటల్‌‌‌‌గా పిలుస్తున్నారు. ఇక్కడ డెలివరీ కేసులు, యాక్సిడెంట్​కేసులతో పాటు ఇతర పెషేంట్లు ఎక్కువగా వస్తారు. ఓపీ రోజుకు 500 నుంచి 700 వరకు ఉంటుంది. ఇన్‌‌‌‌ పెషేంట్లకు బెడ్స్ సరిపోక అడిషనల్‌‌‌‌గా మరో 80 ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్​టెస్టు,  కరోనా వార్డు, అలన సెంటర్, ఎయిడ్స్​ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్, డయాలసిస్ సెంటర్, హోమియో,  ఆయుర్వేధం, నేచురోపతి హాస్పిటల్స్‌‌‌‌ అన్ని కూడా ఇక్కడే  ఉన్నాయి. ఇప్పటికే హాస్పిటల్​ఇరుకిరుకుగా మారింది. డయాగ్నోస్టిక్​హబ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు పరిశీలన చేయాలని భావించినప్పటికీ స్థలం కొరతతో చేయలేదు. దీంతో  ఏర్పాటు పక్రియ అగిపోయింది. తర్వాత మాత, శిశు సంరక్షణ సెంటర్ ఆవరణలో డయాగ్నోస్టిక్​హబ్​ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఎంసీహెచ్ నిర్మాణ పనులు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సెంటర్ ఏర్పాటుకు రూ.కోటి 25 లక్షల ఫండ్స్​శాంక్షన్ అయ్యాయి. ఈ ఫండ్స్‌‌‌‌తో బిల్డింగ్ నిర్మాణ పనులు షూరు చేయగా ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపి త్వరగా డయగ్నోస్టిక్​సెంటర్​ ప్రారంభమయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. 

టెస్టుల కోసం ప్రైవేట్‌‌‌‌లో భారీగా ఖర్చు
బ్లడ్​ టెస్టులతో పాటు ఇతర రోగాలకు  సంబం ధించి టెస్టులకు ప్రైవేట్లో ఎక్కువ ఖర్చవుతుంది. జ్వరం వచ్చిందని హాస్పిటల్‌‌‌‌కు వెళ్తే చాలు  టెస్టుల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా డాక్టర్లు పలు రకాల టెస్టులను రాసి ప్రైవేట్​ల్యాబ్‌‌‌‌కు పంపిస్తున్నారు.  నార్మల్ టెస్టుకు కూడా రూ.500 కంటే తక్కువ  కావడం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలకు టెస్టులు ఆర్థికంగా భారమవుతున్నాయి.  గవర్నమెంట్‌‌‌‌కు, ప్రైవేట్​ హాస్పిటళ్లకు వచ్చే పెషేంట్లు రోజుకు 400 నుంచి 500 మంది వరకు టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌లకు వెళ్తున్నారు. 

ఫిబ్రవరి కల్లా కంప్లీట్​ చేస్తాం
డయాగ్నోస్టిక్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణ పనులు పిబ్రవరి వరకు కంప్లీట్​చేయిస్తాం. పనులు కొద్ది రోజుల కింద షూరు చేసినప్పటికీ వర్షాల కారణంగా డిలే జరుగుతోంది. బిల్డింగ్​కంప్లీట్​అయితేనే మిషనరీ వస్తుంది.‌‌‌‌‌‌‌‌ - అరవింద్, ఏఈ, మెడికల్ ఇంజనీరింగ్ వింగ్