సిటీలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విగ్రహ తరలింపుపై జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఉజ్వల పార్క్‌లో పీవీ విగ్రహం ఉండగా, దానిని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు తరలించాలని మున్సిపల్ అధికారులు రెండేండ్ల కింద నిర్ణయించారు. అప్పట్లో పనులు మొదలుపెట్టి ఇప్పటిదాకా పూర్తిచేయలేదు. కేంద్ర ప్రభుత్వం పీవీని భారతరత్న ఇచ్చి గౌరవించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వెలుగు, ఫొటోగ్రాఫర్, కరీంనగర్