
స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్. ఒకవేళ మీరు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే వెంటనే ఆ మెసేజ్ ను డిలీట్ చేయమని FBI అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. యూఎస్ లో ఉండే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు.. ఇటీవల సర్క్యులేట్ అవుతున్న ఆ మెసేజ్ ను వెంటనే డిలీట్ చేయకుంటే బుక్కై పోతారని హెచ్చరించారు. స్మిషింగ్ అటాక్స్ ఎక్కువయ్యాయని వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటో.. డిలీట్ చేయకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ లేదా ఐ ఫోన్ వినియోగదారులు అత్యంత వేగంగా స్ప్రెడ్ అవుతున్న టెక్స్ట్ మెసేజ్ లను వెంటనే డిలీట్ చేయాలని FBI అధికారులు వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత సమాచారం తో పాటు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ను ఈ మెసేజ్ సెండ్ చేసి గ్రాబ్ చేస్తారని హెచ్చరించారు. యూఎస్ లో ‘‘smishing’’ వేవ్స్ ఎక్కువ అయ్యాయని వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SMS, phishing అనే పదాల నుంచి smishing అనే పదం వచ్చింది. ఇక్కడ smishing అంటే అత్యంత వేగంగా ఫ్రాడ్యులంట్ మెసేజ్ లు స్ప్రెడ్ కావడం. అయితే ఎక్కడో యూఎస్ లో స్ర్పెడ్ అయ్యే మెసేజ్ లతో మనకేం నష్టం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ కు యూఎస్ అయినా ఇండియా అయినా ఫ్రాడ్ చేసేందుకు ఒకే సమయం పడుతుంది. జస్ట్ వన్ క్లిక్ తో మెసేజ్ లు ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోతాయి.
మెసేజ్ లను పంపించి ఏదో ఆశ చూపించి లింక్ క్లిక్ చేయమని అడుగుతుంటారు. దీంతో ఫోన్ లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫో తో పాటు పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కాపీ చేసుకుంటారు. కొన్ని సార్లు మెసేజ్ లో ఉండే లింక్ క్లిక్ చేయకపోయినా ఫోన్ లో ఉన్న సమాచారాన్ని కాపీ చేసుకుంటారు. ఇలాంటి స్కామ్స్ కోసం సైబర్ క్రిమినల్స్ 10 వేల డొమైన్స్ రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. 2025 న్యూ ఇయర్ ఆరంభం నుంచి ఇది నాలుగు రెట్లు అయినట్లు తెలుస్తోంది.
టెక్స్ట్ మెసేజ్ స్కాం లు ఎలా చేస్తారు?
పాలో ఆల్టో అనే థ్రెట్ ఇంటల్లిజెన్స్ సంస్థ యూనిట్ 42 ప్రకారం.. ఫేక్ పేమెంట్ నోటిఫికేషన్స్, డెలివరీ నోటిఫికేషన్స్ తో మెసేజ్ లు సెండ్ చేస్తారు. లింక్స్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇచ్చేలా ఆశ చూపిస్తారు. ఫేమస్ వెబ్ సైట్స్, సంస్థలు, బ్యాక్స్ నుంచి నోటిఫికేష్స్ పంపినట్లుగా పంపిస్తారు. వివిధ సైట్లలో ఉండే ఐటమ్స్ చాలా తక్కువ ధరకు కనిపించడంతో డీటెయిల్స్ ఎంట్రీ చేస్తుంటాం. ఉదాహరణకు అమెజాన్ లో ఒక టీవీ 25 వేలు ఉంటే.. అదే అమెజాన్ సైట్ నుంచి మెసేజ్ పంపినట్లుగా చెప్పి 8 లేదా 10 వేలకే ఆఫర్ ఇస్తున్నట్లుగా లింక్స్ పంపిస్తారు. డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మొత్తం గుంజేసుకుంటారు అని సంస్థ రిపోర్ట్ లో వెల్లడించింది.
డేంజర్ స్కాం.. లింక్స్:
స్కామ్మర్ లు పంపించే లింక్స్ క్లిక్ చేయడం వలన మన A to Z డాటా యాక్సెస్ చేసుకునేందుకు మనమే పర్మిషన్ ఇచ్చినట్లుంటుందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) తెలిపింది. చైనా డొమైన్ .XIN ఉపయోగించి ఎక్కువగా ఫ్రాడ్ చేస్తున్నారని, వాటిని గుర్తించింది. అవి:
* dhl.com-new[.]xin
* fedex.com-fedexl[.]xin
* sunpass.com-ticketap[.]xin.
ఈ ఫ్రాడ్ మెసేజెస్ కు అమెరికాలోని చాలా రాష్ట్రాలు, సిటీలు ఎఫెక్ట్ అయ్యాయి. యూఎస్ లోని డల్లాస్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, చికాగో, ఓర్లాండో, మియామి తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని McAfee రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్కాం కు పాల్పడుతున్నారని, ఇండియన్స్ కూడా ఇలాంటి ఫ్రాండ్ మెసేజ్ లు చూసేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.