
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో అభివృద్ధి పేరుతో సింగరేణి క్వార్టర్లను తొలగించి కార్మిక కుటుంబాలను తరలించడం సరికాదని సింగరేణి బీఎంఎస్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య అన్నారు. ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాలతో కలిసి సింగరేణి ఇల్లందు గెస్ట్‌హౌస్ వద్ద డైరెక్టర్ఎన్వీకె శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ క్వార్టర్స్‌లో 30 ఏండ్లగా నివాసముంటున్న కార్మికులను ఉన్నపళంగా ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు.