ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు : ఊగిపోయిన బిల్డింగ్స్.. బయటకు పరుగులు

భూకంపంతో ఢిల్లీ వణికిపోయింది. బలమైన భూ ప్రకంపనలతో ఢిల్లీ హడలిపోయింది. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయాందోళకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లోని ఉద్యోగులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆఫీసుల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

ఢిల్లీతో పాటు.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ 10 సెకన్లకు పైగా ప్రకంపనలు వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం  రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం  మధ్యాహ్నం 2:25 గంటలకు నేపాల్‌ను తాకినట్లు వెల్లడించింది.