Delhi Air Pollution: ఢిల్లీలో లాక్ డౌన్ సిచ్యూవేషన్..ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

దేశ రాజధాని ఢిల్లీ గత వారం రోజులు గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీ , దాని సరిహద్దు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో నమోదు అవుతోంది. బుధవారం( నవంబర్ 20) ఉదయం కూడా వాయు కాలుష్యం సివియర్ కేటగిరిలో రికార్డయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  మరిన్ని చర్యలు చేప్టటింది. బుధవారం నుంచి 50 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇండ్లనుంచి పని చేస్తారని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.  

బుధవారం ఢిల్లీ, దాని సరిహద్దు రాష్ట్రాల్లో  ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ సివియర్ కేటగిరిలో నమోదు అయింది. ఉదయం7 గంటల సమయంలో AQI 463 నమోదు అయింది. ముండ్కలో 464 , వాజీ పూర్, అలిపూర్ లో462 AQI నమోదు అయింది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు  పేరుకుపోయింది. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు సమీపంలో  పూర్తిగా విజిబిలిటీ తగ్గిపోయింది. రోజంతా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఢిల్లీ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఢిల్లీ ప్రభుత్వ చర్యలు .. 

ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ అరికట్టేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ ..సోమవారంనుంచి GRAP ఫోర్త్ స్టేజ్ ని  అమలు చేస్తుంది. ఢిల్లీ -ఎన్ సీఆర్ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదు అయినప్పుడు  GRAP ఫోర్త్ స్టేజ్ ని  అమలు చేస్తారు. GRAP ఫోర్త్ స్టేజ్ ని  2017 లో సుప్రీంకోర్టు ఆమోదించింది.  

GRAP ఫోర్త్ స్టేజ్ ప్లాన్ ప్రకారం.. 

  • ఢిల్లీలోకి ట్రక్కుల రాకపోకలను నిలిపివేస్తారు. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే, అవసరమైన సేవలను అందించే ట్రక్కులు LNG/CNG/ఎలక్ట్రిక్/BS-VI డీజిల్ ట్రక్కులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. 
  • హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు, టెలికమ్యూనికేషన్స్ మొదలైన లీనియర్ పబ్లిక్ ప్రాజెక్ట్‌ల కోసం కూడా GRAP స్టేజ్-IIIలో వలె నిర్మాణ ,కూల్చివేత కార్యకలాపాలను నిషేధం. 
  • 12 వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహణ, 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లో 50 శాతం వర్క్ ఫోర్స్ తో పనిచేయడానికి చర్యలు 
  • అవసరమైన విద్యాసంస్థలు, అత్యవసర వ్యాపార కార్యకాలాపులు కూడా మూసివేయవచ్చు.రిజిస్ట్రేషన్ నంబర్ల బేసి సరి ప్రాతిపదికన వెహికల్స్ ను అనుమతిస్తారు.