న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎయిర్ పొల్యూషన్ రికార్డు స్థాయిలో నమోదు అయింది. గాలి నాణ్యత ఆందోళకర స్థాయికి పడిపోయింది. మంగళవారం ఢిల్లీలో బాణసంచా నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రజలు దీపావళిని టపాసులతో జరుపుకున్నారు.
లజ్ పత్ నగర్, కల్కాజీ, ఛతర్ పూర్, జౌనాపూర్, కైలాష్ ఈస్ట్, సాకేత్, రోహిణి, ద్వారక, పంజాబీ బాగ్, వికాస్ పురి, దిల్షాద్ గార్డెన్, బురారీ ఈస్ట్, పశ్చిమ ఢిల్లీలతోపాటు అనేక ఇతర ప్రాంతాల్లో బాణసంచాపేల్చారు. దీంతో వాయు కాలుష్యం ఆందోళరకర స్థాయికి పెరిగింది.
ఢిల్లీలో నవంబర్ 1 ఉదయం 10.30 కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 362గా నమోదు అయింది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలలో బాణాసంచా కాల్చడం, పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగాయి. దీంతో దీపావళి మరుసటి రోజు అయిన శుక్రవారం (నవంబర్1) ప్రధాన నగరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది,శ్వాసకోశ సమస్యలు,ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమైంది.
Also Read :- ఒక్కో గుడ్లగూబకు రూ.50 వేలా?
2022లో 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, 2019లో 281, 2021లో 281, 2022లో 382, 2022లో 382 ఏక్యూఐతో నమోదు అయింది. వీటితో పోలిస్తే గత సంవత్సరం, రాజధాని పౌరులు దీపావళి రోజున స్పష్టమైన ఆకాశం మరియు సమృద్ధిగా సూర్యరశ్మిని ఆస్వాదించారు. CPCB ప్రకారం 2016లో 431 AQI నమోదు అయింది.