ఢిల్లీలో వాయుకాలుష్యం ఏమాత్రం తగ్గడంలేదు..గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలను ఊపీరి పీల్చుకోకుండా చేస్తున్న ఎయిర్ పొల్యూషన్.. నివారం (నవంబర్23) ఉదయం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఢిల్లీ నగరంలోని మొత్తం 39 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో 19 కేంద్రాల్లో దాదాపు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది. ఢిల్లీ మొత్తం సగటున 445 AQI రికార్డయింది.
గత వారంలోరోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. సెవియర్, సెవియర్ ప్లస్ కేటగిరిలో AQI నమోదు అవుతూ వస్తుంది. అయితే శనివారం ఉదయం కొద్దిగా తగ్గింది. దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371 నమోదు అయింది.
వాయు కాలుష్యం పరిష్కరించే ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAS) స్టేజ్ 4 ను అమలు చేస్తోంది. ఢిల్లీనుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం విధించింది. నిత్యావసరాల తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే సిటీలో అనుమతిస్తుంది.
మరోవైపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో ఉద్యోగులను 50 శాతం ఇంటినుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో స్కూళ్లకు సెలవులు, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.