ఢిల్లీలో డేంజర్ బెల్స్..ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో పెరిగింది. మంగళవారం ఉదయం సివియర్ ప్లస్ కేటగిరిని మించి వాయు కాలుష్యం నమోదు అయింది. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగలతోపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. AQI 494 కంటే ఎక్కువగా రికార్డు అయింది. ఈ సీజన్ లో ఇదే అత్యధికం..ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్( GRAP)- IV అమలులో ఉంది.
దేశరాజధాని ఢిల్లీ అంతటా గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లు అత్యధింగా 500 మార్క్ ను తాకాయి.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఎల్ ఎ్ జీ, బిఎస్ 4 డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వంటి కాలుష్యం తక్కువగా ఉండే వాహనాలకు మాత్రమే అనుమతినిస్తోంది.
Also Read :- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇక గాలి నాణ్యత తక్కువ కావడంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నర్సరినుంచి 12 వ తరగతి వరకు భౌతిక క్లాసులు నిలిపివేయాలని , ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ, దానిసరిహద్దు రాష్ట్రాలను ఆదేశించింది.
మరో వైపు ఎయిర్ పొల్యూషన్ దారుణంగా పడిపోవడంతో ఢిల్లీలో ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 23 వరకు ఢిల్లీ యూనివర్సిటీ ఆన్‌లైన్ తరగతులు, నవంబర్ 22 వరకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహిస్తుందని ప్రకటించింది, రాజధానిలో గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని పేర్కొంది.
ఢిల్లీలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, జహంగీర్‌పురి, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంతో సహా పలు ప్రాంతాల్లో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ మంగళవారం ఉదయం 500కి చేరుకుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నివేదించింది. ఇది ప్రజారోగ్యం భద్రతపై ఆందోళనలను పెంచుతుంది.