ప్రయాణికులకు అలర్ట్: వారం రోజులపాటు ఢిల్లీ ఎయిర్ పోర్టు మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

ప్రయాణికులకు అలర్ట్: వారం రోజులపాటు  ఢిల్లీ ఎయిర్ పోర్టు మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..


ఢిల్లీ ఎయిర్ పోర్టు వారం రోజుల పాటు మూత పడనుంది. ప్రతిరోజు గంటన్నరకు పైగా ఎయిర్ పోర్టు రన్ వే మూతపడనుండటంతో ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది ఎయిర్ పోర్టు అథారిటీ. జనవరి 19 నుంచి 26 వరకు ఢిల్లీ ఎయిర్ పోర్టు రన్ వే రోజూ 145 నిమిషాలు మూతపడనుందని అధికారులు NOTAM (Notice to Airmen) విడుదల చేశారు. ఈ వారం రోజులు ఉదయం 10.20  నుంచి మధ్యాహ్నం 12.45 వరకు రిపబ్లిక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మూసివేయనున్నారు.  ప్రతిరోజూ ఈ సమయంలో డ్రిల్స్, డ్రెస్ రిహార్సల్స్, రిపబ్లిక్ డే పరేడ్ తదితర కార్యక్రమాలు ఉండనున్నాయి. 

విమాన ప్రయాణికులపై ప్రభావం:

రిపబ్లిక్ డే ప్రి సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పరేడ్ కారణంగా ఎయిర్ పోర్టు రన్ వే వారం రోజుల పాటు మూత పడనుందని వైమానిక అధికారులు తెలిపారు. దీంతో 13 వందలకు పైగా ఫ్లైట్ ల కు అంతరాయం కలగనుందని వెల్లడించారు. ఇందులో 665 ఢిల్లీ నుంచి వెళ్లేవి ఉండగా, 671 విమానాలు రావాల్సినవి ఉన్నాయి. ఇందులో టొరంటో, వాషింగ్టన్, తాష్కెంట్, కొలంబో తదితర అంతర్జాతీయ ఫ్లైట్ లు కూడా ఉన్నాయి. కొన్ని ఫ్లైట్లను క్యాన్సల్ చేస్తుండగా మరికొన్నింటి టైమింగ్స్ మార్చుతున్నట్లు తెలిపారు. అయితే ఎప్పుడు రద్దీగా ఉండే రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో పీక్ టైమింగ్స్ లో తీవ్ర ఇబ్బందులు కలగవచ్చునని చెబుతున్నారు. 

ALSO READ | 17 సంవత్సరాల క్రితమే మర్డర్.. కట్ చేస్తే యూపీలో ప్రత్యక్షం.. పాల్ విషయంలో అసలేం జరిగింది..?

ప్రయాణికులకు సూచనలు:

  • ఢిల్లీ నుంచి వచ్చే వారు లేదా వెళ్లే ప్రయాణికులు తమ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను అప్డేట్ చేసుకోవాలి.
  • ప్రస్తుత ఫోన్ నెంబర్, ఇ-మెయిల్ సరిగ్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకోండి
  • వీలైతే నిబంధనల టైమ్ కాకుండా ఆ తర్వాతి సమయాలలో ఫ్లైట్ ఉండేలా రీబుక్ చేసుకోండి
  • ఇలాంటి అంతరాయం కలిగిన సమయంలో ఫ్లైట్ క్యాన్సల్ చేసినపుడు రీఫండ్ ఇస్తుంటారు. అయితే రీ రిజిస్ట్రేష్ చేసుకోండి.
  •  ఒక్కోసారి హై కాస్ట్ పడుతుంది.. దానికి సిద్ధపడితేనే రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ సూచించింది