కేంద్రంపై జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ దావా

కేంద్రంపై జీఎంఆర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ దావా

న్యూఢిల్లీ: ఘజియాబాద్‌‌‌‌లోని  డిఫెన్స్ ఎయిర్‌‌‌‌బేస్‌‌‌‌ హిండన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ స్టేషన్ నుంచి కమర్షియల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, ఇండియన్ గవర్నమెంట్‌‌‌‌పై  ఢిల్లీ హై కోర్టులో జీఎంఆర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ లిమిటెడ్  దావా వేసింది.  ఏవియేషన్ రూల్స్ ప్రకారం, ఎయిర్‌‌పోర్ట్‌ పరిధిలోని150 కిలోమీటర్లలో కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లకు అనుమతి ఇవ్వకూడదు.  

హిండన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ స్టేషన్ ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు కమర్షియల్ ఫ్లైట్స్‌‌‌‌కు అనుమతి ఇస్తే తాము ఆర్థికంగా నష్టపోతామని జీఎంఆర్ పేర్కొంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌  జీఎంఆర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ , ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫ్రాపోర్ట్‌‌‌‌ ఏజీ ఫ్రాంక్‌‌‌‌ఫర్ట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుల జాయింట్ వెంచర్.