కేకే సర్వే : ఢిల్లీలో గెలిచేది ఆప్ పార్టీనే

కేకే సర్వే : ఢిల్లీలో గెలిచేది ఆప్ పార్టీనే

ఢిల్లీలో పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ ముగిశాయి. ఆల్ మోస్ట్ పాపులర్ సర్వే సంస్థలు అన్నీ బీజేపీదే విజయం అని స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఉన్న కేకే సర్వే మాత్రం.. అందుకు భిన్నంగా తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. ఢిల్లీలో గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆప్ అంటూ తన రిపోర్ట్ విడుదల చేసింది. 

70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 44 సీట్లు, బీజేపీ 26 సీట్లు గెలుస్తుందని స్పష్టం చేసింది కేకే సర్వే. ఢిల్లీ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ల సంఖ్య ఎక్కువ అని.. ఆ 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఆప్ పార్టీదే విజయం అని స్పష్టం చేసింది కేకే సర్వే. 

ALSO READ | Delhi Elections:ఢిల్లీ పీఠం బీజేపీదే..ఎగ్జిట్ పోల్ సర్వేలు

తొమ్మిది నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు పోలింగ్ జరిగిందని.. ఈ తొమ్మిది స్థానాల్లోనూ ఆరు చోట్ల ఆప్ పార్టీదే విజయం అని వెల్లడించింది ఈ సర్వే.దీంతో వరుసగా నాలుగోసారి కూడా ఢిల్లీలో ఆప్ పార్టీదే హవా కొనసాగడం ఖాయమని తేలిపోయింది.