Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

Delhi Assembly Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్
  •  18  సీట్లలో బీజేపీ, ఆప్ పార్టీల మధ్య హోరా హోరీ.. కేవలం 2 వేల ఓట్ల స్వల్ప మార్జిన్ తో కొనసాగుతున్న అభ్యర్థులు
  • 11.30 గంటల సమయానికి 45 స్థానాల్లో బీజేపీ.. 25 స్థానాల్లో ఆప్ పార్టీ ముందంజ.. వెయ్యి ఓట్ల తేడాతో 10 నియోజకవర్గాల్లో బీజేపీ, ఆప్ పార్టీ అభ్యర్థుల మధ్య ఆధిక్యం దోబూచులాట.
  • 4వ రౌండ్ తర్వాత ముందంజలో మనీష్ సిసోడియా.. 3773  ఓట్లతో లీడ్. 
  • ఆరో రౌండ్ తర్వాత వెనకబడిన కేజ్రీవాల్., 225 ఓట్ల తేడాతో.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ ముందంజ
  • జంగ్ పురాలో దూసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి.. మనీష్ సిసోడియా వెనకంజ
  • కల్కాజీలో మళ్లీ వెనకబడ్డ అతిశీ.. ముందంజలో రమేష్ బిధూరి
  • కల్కాజీలో థర్డ్ ప్లేస్ కు పరిమితమైన అల్కా లాంబా
  • న్యూఢిల్లీలో మూడవ స్థానంలో సందీప్ దీక్షిత్
  • కాంగ్రెస్ అగ్రనేతలు సందీప్  దీక్షిత్, అల్కా లాంబా వెనకంజ
  • జంగ్ పురాలో మనీష్ సిసోడియా ముందంజ
  • ఛతర్‌పూర్‎లో బీజేపీ నేత కర్తార్ సింగ్ తన్వర్ లీడ్
  • న్యూఢిల్లీలో అధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్
  • ఎట్టకేలకు లీడ్ లోకి ఆప్ అగ్రనేతలు
  • రాజిందర్ నగర్ నుంచి ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ ఆధిక్యం
  • బాబర్‌పూర్ అసెంబ్లీలో ఆప్ అభ్యర్థి గోపాల్ రాయ్ ముందంజ
  • 47 స్థానాల్లో బీజేపీ అధిక్యం.. 21 చోట్ల ఆప్ లీడ్
  • మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ.. 37  చోట్ల అధిక్యం
  • ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజ
  • షాకుర్ బస్తీలో ఆప్ నేత సత్యేంద్రకుమార్ జైన్ లీడింగ్
  • పత్పర్ గంజ్లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజ
  • బిజ్వాసన్ సెగ్మెంట్లో బీజేపీ క్యాండిడేట్ కైలాష్ గహ్లోత్ లీడింగ్
  • బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజ
  • కల్కాజీలో దూసుకుపోతున్న రమేష్ బిధూరి.. అతిశీ వెనకంజ
  • న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ముందంజ.. వెనకబడ్డ కేజ్రీవాల్
  • జంగ్ పురాలో మనీష్ సిసోడియా ఎదురీత.. అధిక్యంలో బీజేపీ అభ్యర్థి
  • మొదలైన ఈవీఎంల ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ, ఆప్ మధ్య టఫ్ ఫైట్.. 15 చోట్ల బీజేపీ, 12 చోట్ల ఆప్, రెండు చోట్ల కాంగ్రెస్ లీడ్
  • బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ.. చెరో 12 చోట్ల లీడ్
  • జంగ్ పురాలో సిసోడియా, న్యూఢిల్లీలో కేజ్రీవాల్, కల్కాజీలో అతిశీ వెనకంజ
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో  ఆప్ అగ్రనేతలు వెనకంజ
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం.. వెనకబడ్డ ఆప్
  • పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆప్, బీజేపీ హోరాహోరీ.. ప్రభావం చూపించని కాంగ్రెస్


న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దేశ మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను శనివారం (ఫిబ్రవరి 8) ఉ.8 గంటలకు అధికారులు మొదలు పెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10 వేల మందిని మోహరించారు.  

అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. అధికారం దక్కాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాలి. మొత్తం 699 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోరు సాగగా.. కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే మొగ్గుచూపాయి. 50కి పైగా సీట్లు గెలుస్తామంటూ బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.