ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్

వచ్చే నెల(ఫిబ్రవరి) 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా బుధవారం (జనవరి 15) నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్‌ ప్రాంతంలోని  హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్‌ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. 

ALSO READ | కేజ్రీవాల్‌‌, సిసోడియాలకు భారీ షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌

నామినేషన్ల అనంతరం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. విద్య, ఉద్యోగం కోసం అందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. విద్య, ఆరోగ్యం, కరెంటు, రోడ్లు.. ఇలా చేయాల్సిన ఎన్నో పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రజలు మంచి, చెడు తెలుసుకొని ఓటేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ  అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.