
న్యూఢిల్లీ: 2015 లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన కామెంట్స్ పై వివాదం రేగింది. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ నెలకొంది. పోటాపోటీగా నినాదాలు చేయడం తో సభ జరిగే పరిస్థితి లేదు. దీంతో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను బయటకు తీసుకెళ్లాలంటూ మార్షల్స్ ను స్పీకర్ ఆదేశించారు. గుప్తాను మార్షల్స్ బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో అప్పట్లో వైరల్ గా మారాయి. కాగా, నాడు మార్షల్స్ ద్వారా బలవంతంగా బయటకు పంపిన ఎమ్మెల్యే నేడు సభాపతిగా అడుగుపెట్టనున్నారు.