ఇంత కిరాతకం ఏంటీ : టాక్సీ డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లారు

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై కొందరు దుండగులు.. 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ను దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో  అక్కడికక్కడే మరణించాడు. అక్టోబర్ 10న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డ్రైవర్‌ తలకు బలమైన గాయమై రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్రగా గుర్తించారు.

Also Read :- సైకిల్ మారథాన్లో గుండెపోటు

బిజేంద్ర మహిపాల్‌పూర్ ప్రాంతంలో తన టాక్సీని నడుపుతున్నప్పుడు దొంగల బృందం అతని వాహనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దానికి అతను ప్రతిఘటించడంతో, వారు అతనిపై దాడి చేసి, దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. ఇది అతని మరణానికి దారితీసింది. నిందితుడు పరారీలో ఉండగా.. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.