ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం..ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం

ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం..ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఏకపక్ష ఫీజుల నియంత్రణకు ఓ చట్టాన్ని  తీసుకొస్తుంది. మంగళవారం (ఏప్రిల్ 29) ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది చట్టం అయితే ఢిల్లీ అంతటా విద్యార్థుల పేరెంట్స్ కు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.

దేశ రాజధాని అంతటా స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగిపోతుండటంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. ఈ చట్టం అమలులోకి వస్తే ఫీజుల విషయంలో ఉపశమనం దొరకనుంది. 

ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎటువంటి చట్టం లేదు.దీంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా ఫీజులు పెంచుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ చట్టంలో అమలు అయితే అధిక ఫీజులు నియంత్రించే అవకాశం ఉంది. 

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. 1973 నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో స్కూల్ ఫీజుల నియంత్రణకు ఎటువంటి నిబంధన లేదు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం స్కూల్ ఫీజుల నియంత్రణకు చారిత్రాత్మకమైన సాహసపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి చట్టం చేస్తామన్నారు. 

ఢిల్లీ వ్యాప్తంగా 1677 ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి.ఈ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు, విధానాలతో సమగ్ర బిల్లును రూపొందించామన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.