- ఆత్మహత్యకు ముందు ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా వీడియో నోట్
- భార్యే తన జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫేమస్ వుడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఆత్మహత్య ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునీత్ ఖురానా సూసైడ్ చేసుకోవడానికి ముందు రికార్డ్ చేసిన వీడియో నోట్ ఒకటి బయటకొచ్చింది. భార్య మణికా పహ్వా, ఆమె సోదరితోపాటు తల్లిదండ్రులు తనను విపరీతంగా హింసించారని..వాళ్ల టార్చర్ భరించలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో పునీత్ ఖురానా వివరించాడు.
" పరస్పర అంగీకారంతో నేనూ, నా భార్య డైవర్స్ కు అప్లై చేశాం. అప్పటి నుంచే నా అత్తమామలు, నా భార్య నన్ను తీవ్రంగా హింసించడం స్టార్ట్ చేశారు. విడాకులకు సంబంధించిన కొన్ని షరతులపై మేం కోర్టులో సంతకం చేశాం. ఆ షరతులను 180 రోజుల వ్యవధిలో నెరవేర్చాలి. కానీ నా అత్తమామలు, నా భార్య షరతులను వెంటనే నెరవేర్చాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. కోర్టు ముందు అంగీకరించిన షరతులనేగాక వాళ్లు కూడా అదనంగా షరతులు విధించారు. అవి నా శక్తికి మించినవి. రూ. 10 లక్షలు చెల్లించాలనే డిమాండ్ అందులో ఒకటి. నేను ఎక్కడి నుంచి ఈ డబ్బు తేవాలి.
నా పేరెంట్స్ ను కూడా అడగలేను. ఎందుకంటే వారు ఇప్పటికే వారి శక్తికి మించి ఇచ్చారు" అని పునీత్ తన చివరి వీడియోలో తెలిపాడు. పునీత్ తో మణిక మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అందులో మణికా అతడిని దారుణంగా తిట్టడం వినిపించింది. "నాకు నీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది.
విడాకులు తీసుకుంటే.. నన్ను బిజినెస్ పార్ట్ నర్ షిప్ నుంచి తీసేస్తావా ? ఇలాగే బెదిరిస్తే సూసైడ్ చేసుకుంటా" అని పేర్కొంది. కాగా, పునీత్ భార్య పేరు మీద ఇంటి నిర్మాణం కోసం రూ. 2 కోట్లు ఇచ్చాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. అయినా మరింత డబ్బు కోసం వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.