
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీ దర్బార్‌లో గులాములని విమర్శించారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు. నల్లగొండలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐదేళ్లలో మోడీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. మోడీ వేడి తగ్గిందని..150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాహుల్ గాంధీకి 100 సీట్లు కూడా రావన్నారు. ఆలోచించి కాంగ్రెస్, బీజేపీని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు.
నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలకే ఎక్కువ సీట్లు ఉన్నాయన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసించవచ్చన్నారు. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్ అన్నారు కేటీఆర్.