IPL 2025: పాంటింగ్ స్థానంలో హెడ్ కోచ్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025: పాంటింగ్ స్థానంలో హెడ్ కోచ్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించింది. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని ఢిల్లీ యాజమాన్యం తమ హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్టు తెలిపింది. రికీ పాంటింగ్ స్థానంలో బదానీ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ గా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాలరావును  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ప్రకటించింది.

“ఢిల్లీ క్యాపిటల్స్‌కు హేమాంగ్, వేణులను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇద్దరూ చాలా కాలంగా మా టీమ్‌లో కొనసాగారు. వారికి ఈ పాత్రలు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాలు అందించడంలో వారి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది". అని ఢిల్లీ క్యాపిటల్స్ ఛైర్మన్, సహ యజమాని కిరణ్ కుమార్ గ్రాంధి అన్నారు. 

టీమిండియా తరపున బదానీ నాలుగు టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. 2021-23 మధ్య ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫీల్డింగ్ కోచ్‌గా,  బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. లంక ప్రీమియర్ లీగ్ లో అతను కోచ్ గా ఉన్న జాఫ్నా కింగ్స్ వరుసగా రెండు టైటిల్స్ గెలుచుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా పని చేయగా ఆ జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లోనూ  దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో ఆ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 

ALSO READ | IND Vs NZ, 1st Test: కుప్పకూలిన టీమిండియా.. వసీం జాఫర్ సెటైరికల్ వీడియో

వేణుగోపాలరావు టీమిండియాన్ తరపున 16 వన్డేలు ఆడాడు. అతను 2009 సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్‌ టైటిల్ గెలిచిన సభ్యుల్లో ఒకరు. 2011 నుంచి 2013 వరకు అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున ఆడాడు. 2024 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ.. గత మూడు ఎడిషన్‌లలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడానికి కూడా చాలా కష్టపడింది. 2023లో తొమ్మిది, 2022లో ఐదు, 2021లో మూడు, 2019లో మూడు, 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.