
న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త కోచింగ్ బృందంతో రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటార్‌గా నియమించుకుంది. 2019 నుంచి 2016 వరకు డీసీకి ఆడిన పీటర్సన్ 2014లో కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో పీటర్సన్‌కు కోచ్‌గా ఇదే తొలి అసైన్‌మెంట్ కావడం గమనార్హం.
కెరీర్‌లో 200 టీ20లు ఆడిన పీటర్సన్ 5695 రన్స్ చేశాడు. 36 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1001 రన్స్ సాధించాడు. మెగా లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పుణెకు ఆడిన అనుభవం ఉంది. ఈ ఐపీఎల్ కోసం కోచింగ్ బృందాన్ని మొత్తం మార్చిన డీసీ కొత్త హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ ప్లేస్‌లో హేమంగ్ బదానీకి చాన్స్ ఇచ్చింది. అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ మోట్, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావును తీసుకుంది.
First words from KP, the Dilli Mentor 💙❤️ pic.twitter.com/GB7118Xtc7
— Delhi Capitals (@DelhiCapitals) February 27, 2025