Delhi Capitals: అనుభవానికే ఓటు.. వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals: అనుభవానికే ఓటు.. వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ వైస్ కెప్టెన్ ను ప్రకటించింది. ఇటీవలే ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా నియమించిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. సోమవారం (మార్చి 17) తమ జట్టుకు వైస్ కెప్టెన్ ఎవరో రివీల్ చేసింది. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను తమ వైస్ కెప్టెన్ గా నియమిస్తూ అధికారికా ప్రకట చేసింది. సోమవారం మధ్యాహ్నాం వారి అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించింది. 

2025 నవంబర్ 25న జరిగిన మెగా వేలంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్ ను రూ. 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. మొదట్లో ఈ సఫారీ బ్యాటర్ ను కొనడానికి ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోవడం విచారకరం. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. డుప్లెసిస్ పై నమ్మకం ఉంచడమే కాదు అతనికి ఏకంగా వైస్ కెప్టెన్ గా నియమించడం విశేషం. డుప్లెసిస్ ఐపీఎల్ మూడు సీజన్ ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. బ్యాటర్ గాను అద్భుతంగా రాణించగల ఈ సౌతాఫ్రికా ఆటగాడిపై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ఆశలే పెట్టుకుంది.      

ALSO READ | భయపడాల్సిన అవసరం లేదు.. మహమ్మద్ షమీకి లెటర్ రాసిన క్రీడా మంత్రి

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ రూపంలో ఆ జట్టు బలంగా కనిపిస్తుంది. డుప్లెసిస్ చేరడంతో ఆ జట్టు బలం పెరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో డుప్లెసిస్ బాగా ఆడినప్పటికీ అతని మీద బెంగళూరు జట్టు నమ్మకం ఉంచలేదు. రిటైన్ చేసుకోకుండా వేలంలో అతన్ని రిలీజ్ చేసింది. గత సీజన్ లో రూ. 7 కోట్లకు ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈ సౌతాఫ్రికా ప్లేయర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అబుదాబి టీ20 లీగ్ లో అదరగొట్టాడు.

ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్

అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, నివేద్‌రాజ్ కుమార్, మిచెల్ స్టార్క్, త్రిపురాన విజయ్