ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఎంపిక చేయనుందని సమాచారం. త్వరలో అధికారికంగా అక్షర్ పటేల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ప్రకటించే అవకాశం ఉంది. రూ. 14 కోట్ల రూపాయలు వెచ్చించి రాహుల్ కొనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కెప్టెన్ గా చేస్తారనే వార్తలు వచ్చినా.. అందులో నిజం లేనట్టు తెలుస్తుంది. రాహుల్ తో పాటు కెప్టెన్సీ రేస్ లో ఉన్న మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ ను నిరాశే మిగలనుంది.
2019లో ఢిల్లీ జట్టులో చేరిన అక్షర్ పటేల్ ఆ జట్టుకు కీలక ప్లేయర్ గా మారాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించాడు. దీంతో అక్షర్ ను వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ రూ. 16.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇటీవలే ఈ ఆల్ రౌండర్ టీమిండియా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత సీజన్ లో అక్షర్ బౌలింగ్ లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 131.28 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
Also Read :- రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ. 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు రూ. 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్లు దక్కాయి. నలుగురు ప్లేయర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మెగా ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ (రూ. 14 కోట్లు) తర్వాత రూ. 11.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను కొనుక్కుంది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు), నటరాజన్ (రూ 10.75 కోట్లు) లకు భారీ ధర పలికింది.
🚨 CAPTAIN AXAR PATEL 🚨
— Jonnhs.🧢 (@CricLazyJonhs) January 15, 2025
- Axar patel likely to lead Delhi Capitals in ipl.
- KL Rahul will be playing as a wicket keeper batsman. pic.twitter.com/IVK96RuDt2