జైపూర్: గాయం నుంచి కోలుకుని వచ్చిన పేసర్ అన్రిచ్ నోర్జ్ గాడిలో పడటానికి కొంత టైమ్ పడుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ అన్నాడు. నోర్జ్ ఆరు నెలల తర్వాత కాంపిటీటివ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడని గుర్తు చేశాడు.
‘మా బౌలర్ల గురించి నేను చెడుగా మాట్లాడను. వాళ్లు మా ప్లాన్స్‌ను అమలు చేయడానికి చాలా ప్రయత్నించారు. స్టార్టింగ్‌లో బాగానే బౌలింగ్‌చేశారు. కానీ చివరి ఐదు ఓవర్లలో ధారాళంగా రన్స్ ఇచ్చారు. ఇదే మాకు కొంత ఇబ్బందిగా మారింది. నోర్జ్ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. డెత్ బౌలింగ్‌లో అతనే మా ప్రధాన ఆయుధం. నోర్జ్‌పై మాకు ఇంకా నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్‌కు అతను మెరుగవుతూనే ఉన్నాడు’ అని హోప్స్ పేర్కొన్నాడు.