ఫ్రేజర్ మెక్‌గుర్క్.. ఈ పేరు ఇండియాలో తెలియకపోయినా ఆస్ట్రేలియా క్రికెట్ లో మారు మ్రోగిపోతుంది. ఈ 21 ఏళ్ళ క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో, బిగ్ బాష్ లీగ్ లో సత్తా చాటుతూ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ స్టార్ ఆటగాడిపై ఢిల్లీ క్యాపిటల్స్ కన్ను పడింది. ఐపీఎల్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని తీసుకోవాలని ఢిల్లీ యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తానికి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వలన బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఇతని స్థానంలో ఇంగ్లాండ్ క్రికెట్ డానియల్ లారెన్స్ ను ఎంపిక చేసింది. ప్రస్తుతం బ్రూక్ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్ ఉండగా ఇంకా ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ కాలేదు. దీంతో అతని స్థానంలో ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎంపిక కావడం దాదాపుగా ఖాయమైంది. బ్రూక్ ను 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూ.4 కోట్లకు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. మార్చి 23 న ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
మెక్‌గుర్క్ గత ఏడాది కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 2015లో లిస్ట్-ఏ క్రికెట్‌లో సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. బిగ్ బాష్ లీగ్ లో ఓపెనర్ గా వచ్చి పరుగుల వరద పారించి.. ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు.
Delhi Capitals have shown interest in Jake Fraser-McGurk as a possible replacement for Harry Brook, who's uncertain at the moment. (Code Sports). pic.twitter.com/as5gzOpHZw
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2024