CSK vs DC: సూపర్ కింగ్స్‌పై రాహుల్ మాస్టర్ క్లాస్.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

CSK vs DC: సూపర్ కింగ్స్‌పై రాహుల్ మాస్టర్ క్లాస్.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 77:6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అభిషేక్ పోరెల్ (33), సమీర్ రిజ్వి (21), స్టబ్స్ (24), అక్షర్ పటేల్ (22) తలో చేయి వేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా, నూర్ అహ్మద్, పతిరాణాలకు తలో వికెట్ లభించింది.    

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ సమయంలో అభిషేక్ పోరెల్, రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లే లో రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేయగా.. అభిషేక్ మాత్రం చెలరేగి బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఢిల్లీ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. 

►ALSO READ | CSK vs DC: డుప్లెసిస్ స్థానంలో సమీర్ రిజ్వి.. సఫారీ పవర్ హిట్టర్‌పై నమ్మకం లేదా..?

పవర్ ప్లే తర్వాత 33 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్ ఔటయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ మొదటి బంతికే సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రాహుల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ ముందుకు కదిలింది. అక్షర్ పటేల్ ఔటైనా.. సమీర్ రిజ్వి తో కలిసి రాహుల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రన్ రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో స్టబ్స్ తో కలిసి రాహుల్ జట్టు స్కోర్ ను 180 పరుగులకు చేర్చాడు.