IPL Retention 2025: పంత్ ఔట్.. అక్షర్ పటేల్ టాప్: నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ

IPL Retention 2025: పంత్ ఔట్.. అక్షర్ పటేల్ టాప్: నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి పంత్ రానున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను ఢిల్లీ క్యాపిటక్స్ రిలీజ్ చేసింది. పంత్ ఢిల్లీ జట్టులో ఉండడానికి ఆసక్తి చూపించినట్టు సమాచారం. దీంతో అతడిని వదిలేసుకొని నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ 2025 మెగా ఆక్షన్ లోకి పాల్గొననుంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ. 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు రూ. 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. 

ALSO READ | IPL Retention 2025: ధోనీకి రూ. 4 కోట్లు.. ఐదుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్లు దక్కాయి. నలుగురు ప్లేయర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వారు రూ. 73 కోట్లతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టబోతున్నారు. రిషబ్ పంత్ తో పాటు డేవిడ్ వార్నర్, అన్రిచ్ నార్ట్జే లాంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది.RTM కార్డు ఉపయోగించి ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్,ఒక క్యాప్డ్ ప్లేయర్ ను తీసుకోవచ్చు. లేకపోతే ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్‌లను అయినా తీసుకోవచ్చు.