
ఐపీఎల్ లో శనివారం రెండు మ్యాచ్ లో అభిమానులను అలరించనున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభమైంది. చెన్నైలోకి చెపాక్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో చెన్నై ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
వరుసగా రెండు పరాజయాల తర్వాత సొంతగడ్డపై విజయాల బాట పట్టాలని చూస్తుంది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఓవర్ టన్ స్థానంలో కాన్వే వచ్చాడు. ఇక త్రిపాఠి స్థానంలో ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ ప్లేయింగ్ 11 లో చోరు సంపాదించాడు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ డుప్లెసిస్ లేకుండానే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన