
ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తో పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. జైపూర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంత్ కెరీర్ లో 100 వది కావడం విశేషం. ఢిల్లీ జట్టులో నోకియా, ముఖేష్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతుంది.
ఇప్పటివరకు ఇరు జట్లు ఒకటే మ్యాచ్ ఆడాయి. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జయింట్స్ పై ఘన విజయం సాధిస్తే.. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ చేతిలో ఓడింది. సొంతగడ్డపై రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తే.. ఢిల్లీ ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్
Rishabh Pant has won the toss in Jaipur ✅
— JioCinema (@JioCinema) March 28, 2024
Delhi Capitals will bowl first 🙌#RRvDC #IPLonJioCinema #TATAIPL #JioCinemaSports pic.twitter.com/Bjv9VKU8Pk