LSG vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్టులో శ్రీలంక పేసర్

LSG vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్టులో శ్రీలంక పేసర్

ఐపీఎల్ 2025 లో మంగళవారం (ఏప్రిల్ 22) సూపర్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్,  లక్నో సూపర్ జయింట్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించింది. మరోవైపు లక్నో 8 మ్యాచ్ ల్లో 5 గెలిచింది. నేడు జరగనున్న మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా.. ఆరో విజయంతో ప్లే ఆఫ్ కు చేరువవుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 లోకి శ్రీలంక ఫాస్ట్ బౌలర్ చమీర వచ్చాడు. మరోవైపు లక్నో ఎలాంటి మార్పులు చేయలేదు. 

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

Also Read : ఐపీఎల్‌లో రహానే అరుదైన రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్