DC vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ప్లేయింగ్ 11 నుంచి డుప్లెసిస్ ఔట్!

DC vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ప్లేయింగ్ 11 నుంచి డుప్లెసిస్ ఔట్!

ఐపీఎల్ లో ఆదివారం (ఏప్రిల్ 13) ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడానికి మరో బ్లాక్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. టోర్నీలో అపజయమే లేకుండా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఢిల్లీ గెలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒక విజయం సాధించి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ముంబై ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డుప్లెసిస్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

►ALSO READ | RR vs RCB: ముగ్గురే ఫినిష్ చేశారు: దంచికొట్టిన ఆర్సీబీ టాపార్డర్.. రాజస్థాన్‌పై బెంగళూరు అలవోక విజయం