
ఐపీఎల్ లో బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం (ఏప్రిల్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు వేదికగా చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది. మరోవైపు ఢిల్లీ జట్టులో డుప్లెసిస్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. టోర్నీలో ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. బెంగళూరు నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్