IPL 2025: రోహిత్ కోసం రూ.50 కోట్లు పక్కన పెట్టిన రెండు ఐపీఎల్ జట్లు

ఐపీఎల్ లో మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్..  ప్రస్తుత టీమిండియా వన్డే, టెస్ట్ సారధి రోహిత్ శర్మ గురించి ఒక వార్త  సంచలనంగా మారుతుంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి రోహిత్ శర్మ వస్తే అతని కోసం రెండు జట్లు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఇందులో పెద్దగా ఆశర్యం లేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు రోహిత్ కోసం రూ. 50 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోతెగ వైరల్ గా మారుతుంది. ఇదే నిజమైతే ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. 

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. లక్నో ఐపీఎల్ లోకి అడుగు పెట్టి మూడు సంవత్సరాలైతే.. ఢిల్లీ మాత్రం తొలి సీజన్ నుంచి ఆడుతుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు బలహీనంగా ఉండడంతో పాటు కెప్టెన్సీ అవసరం కూడా ఉంది. దీంతో రోహిత్ పై ఈ రెండు జట్లు కన్నేసినట్టు తెలుస్తుంది. ముంబై ఈ సారి మెగా ఆక్షన్ లోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సూర్య, హార్దిక్, బుమ్రా, కిషన్ లను ఆ జట్టు అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. 

ALSO READ | Shikhar Dhawan: బాధతోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. ధావన్ కెరీర్‌లో హైలెట్స్ ఇవే

ఐపీఎల్ లో రోహిత్ శర్మకు ప్లేయర్ గా, కెప్టెన్ గా గొప్ప రికార్డ్ ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు టైటిల్స్ అందించిన ఘనత హిట్ మ్యాన్ సొంతం. తొలి నాలుగు ఎడిషన్ లలో బలహీనంగా కనిపించిన ముంబై.. రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. అయితే 2024 సీజన్ కు ముందు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ప్రకటించారు. ఇటీవలే భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందించిన రోహిత్.. బ్యాటింగ్ పరంగా చూసుకున్నా సూపర్ ఫామ్ లో ఉన్నాడు.