
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫా డుప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్‌కు డిప్యూటీగాఅతను పనిచేస్తాడని డీసీ ఫ్రాంచైజీ వెల్లడించింది. ‘డీసీ టీమ్ అద్భుతంగా ఉంది. నాణ్యమైన కుర్రాళ్లు అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్ కోసం నేను రెడీగా ఉన్నా’ అని ఈ సందర్భంగా డుప్లెసిస్ పేర్కొన్నాడు. గత మూడు సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును నడిపించిన 40 ఏళ్ల డుప్లెసిస్‌ను మెగా వేలంలో డీసీ తీసుకుంది.
ఇక వ్యక్తిగత కారణాలతో అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ చాలా ఆలస్యంగా మే 20న పంజాబ్ కింగ్స్ జట్టుతో కలవనున్నాడు. ఈ ఫ్రాంచైజీకి చెందిన ఫారిన్ ప్లేయర్లు సోమవారం నుంచి వస్తున్నారు. ఆసీస్ పేసర్ నేథన్ ఎల్లిస్ కూడా ఇంకా చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌లో జాయిన్ కాలేదని సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. రచిన్ రవీంద్ర, డేవన్ కాన్వే ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఇండియా ప్లేయర్లు జడేజా, అశ్విన్ వచ్చేశారు.