GT vs DC: అక్షర్,అశుతోష్ మెరుపులు.. గుజరాత్ ముందు బిగ్ టార్గెట్!

GT vs DC: అక్షర్,అశుతోష్ మెరుపులు.. గుజరాత్ ముందు బిగ్ టార్గెట్!

శనివారం (ఏప్రిల్ 19) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడంతో భారీ స్కోర్ చేసింది. అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39: ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు మిగిలిన వారు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు భారీ స్కోర్ చేసింది. 39 పరుగులు చేసి అక్షర్ పటేల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.  

టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు.. అభిషేక్ పోరెల్ తొలి ఓవర్ లోనే 16 పరుగులు రాబట్టి ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. అయితే రెండో ఓవర్లో అర్షద్ ఖాన్ అభిషేక్ (18) ను ఔట్ చేశాడు. కరుణ్ నాయర్ (31) కు జత కలిసిన రాహుల్ పవర్ ప్లే లో మెరుపులు మెరిపించాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఆరు ఓవర్లలో 73 పరుగులు చేసింది. పవర్ ప్లే కు ముందు రాహుల్ (28) ప్రసిద్ కృష్ణ వేసిన ఒక అద్భుతమైన యార్కర్ కు ఔట్ కాగా.. 9 ఓవర్లో కరుణ్ నాయర్ పెవిలియన్ కు చేరాడు.

Also Read:-సంజు శాంసన్, ద్రవిడ్ మధ్య విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్

ఈ దశలో అక్షర్ పటేల్, స్టబ్స్ కీలక భాగస్వామ్యంతో జట్టును ముందుకు తీసుకెళ్లారు. నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. 31 పరుగులు చేసి స్టబ్స్ (31), అక్షర్ పటేల్ ఔటైనా.. అశుతోష్ (19 బంతుల్లో 37:2 ఫోర్లు, 3 సిక్సర్లు)   చివరి వరకు క్రీజ్ లో ఉండి భారీ స్కోర్ అందించాడు. ఢిల్లీ జట్టులో టాప్ సిక్స్ ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేయడం విశేషం. తొలి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టిన ఢిల్లీ.. చివరి 10 ఓవర్లలో 98 పరుగులు చేసింది.