DC vs RCB: ఆర్సీబీ బౌలర్లు అదరహో .. బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపర్చిన ఢిల్లీ

DC vs RCB: ఆర్సీబీ బౌలర్లు అదరహో .. బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపర్చిన ఢిల్లీ

అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం (ఏప్రిల్ 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో నిరాశపరించింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. రాహుల్ (41), స్టబ్స్ (32) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హేజాల్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యాష్ దయాల్, క్రునల్ పాండ్యకు తలో వికెట్ దక్కింది.           

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ ధాటికి తొలి మూడు ఓవర్లలోనే 32 పరుగులు వచ్చాయి. వరుస బౌండరీలతో హోరెత్తిస్తున్న పోరెల్ (28) ను నాలుగో ఓవర్లో హేజాల్ వుడ్ ఔట్ చేసి ఆర్సీబీకి తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత ఓవర్లో యష్ దయాల్ కరుణ్ నాయర్ (4) ను పెవిలియన్ కు పంపాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ స్కోర్ నెమ్మదించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్, డుప్లెసిస్ ఆచితూచి ఆడారు. 

క్రీజ్ లో ఉన్నత వరకు ఇబ్బందిపడిన డుప్లెసిస్ 26 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపాటికీ వేగంగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ (15) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ తొలి 15 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. ఆడుకుంటాడనుకున్న రాహుల్ (41) తో పాటు.. ఆయుష్ తోష్ శర్మ (2) ఒకే ఓవర్లో ఔటవ్వడంతో ఢిల్లీకి బిగ్ షాక్ తగిలింది. అయితే చివర్లో స్టబ్స్ 18 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రథమమైన స్కోర్ అందించాడు.